ఆసియాలోనే అత్యంత సంపన్నురాలుగా ఉన్న చైనాకు చెందిన యంగ్ హుయాన్ చైనా రియల్ దెబ్బకు భారీగా నష్టపోయారు. ఏడాది క్రితం వరకు ఆమె సంపద 23.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మన రూపాయిల్లో ఇది లక్షా 80 వేల కోట్లు. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆమెకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్ అనే సంస్థలో మోజార్టీ వాటాదారుగా ఉన్నారు.
రియల్ ఢమాల్ కావడంతో ఆమె సంపద 52 శాతం తగ్గిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె సంపద 11.3 బిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని తెలిపింది. బుధవారం నాడు ఈ కంట్రీగార్డెన్ సంస్థ షేర్లు 15 శాతం తగ్గిపోయాయి. దీని వల్ల ఆమెకు భారీగా నష్టం జరిగింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.