ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని సూపర్ పవర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్లతో పలు దేశాల్లో ఏర్పాటు చేసిందనే విస్తుపోయే వాస్తవాలను ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టికా వెల్లడించింది. సొంత దేశాల్లోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారు లక్ష్యంగా, చైనా ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయడంపై మానవహక్కుల ప్రచారకుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది.
కెనడాలో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో (పీఎస్‌బీ) పేరిట చైనా అనధికారిక పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తున్నట్లు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టికా వెల్లడించింది. స్థానిక మీడియా ఫ్యుజ్హుయో ప్రకారం పోలీస్ సర్వీస్ స్టేషన్లను పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోగా కెనడా వ్యాప్తంగా చైనా విస్తరించింది. గ్రేటర్ టోరోంటో ఏరియాలోనే కనీసం మూడు పీఎస్‌బీ స్టేషన్లు ఉన్నాయి. చాలా దేశాల్లోని ఎన్నికలను సైతం. అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా చైనా ప్రభావితం చేస్తోందని రిపోర్టికా వెల్లడించింది. ఫ్యుజ్హుయో పోలీసుల ప్రకారం చైనా 21 దేశాల్లో 30 అక్రమ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.
ఉక్రెయిన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యుకె వంటి దేశాల్లో చైనా ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, చైనాలో పరిస్థితులపై గళం ఎత్తిన దేశాల్లో అత్యధిక పోలీస్ స్టేషన్లను చైనా ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండించింది. అవి కేవలం ఒకేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్లు మాత్రమే అని పేర్కొంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికేనని చైనా అధికారులు ప్రకటించారు.