Sunday, November 24, 2024

తైవాన్‌ జోలికి వస్తే సత్తా చూపుతామన్న చైనా..

తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమనీ, తైవాన్‌ జోలికి ఎవరొచ్చినా యుద్ధం తప్పదని అమెరికాను చైనా హెచ్చరించింది. తైవాన్‌కి స్వాతంత్య్రం కావాలని కోరుతున్నవారు అతి కొద్ది మంది అనీ,వారు కూడా ఇతర దేశాలు పురికొల్పి తేనే ఆ డిమాండ్‌పై ఒత్తిడి చేస్తున్నారని చైనా రక్షణ మంత్రి లీపెంగ్‌ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌కి స్పష్టం చేశారు. చైనాలో ద్వీపప్రాంతమైన తైవాన్‌ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరు చేసినా సహించేది లేదని లీపెంగ్‌ స్పష్టంచేశారు. అధికార వికేంద్రీకరణ కోసమే తైవాన్‌కు అటానమస్‌ ప్రతిపత్తిని చైనా ప్రసా దించిందని లీపెంగ్‌ చెప్పారు. తైవాన్‌ని ఏదో ఒక రోజున స్వాధీనం చేసుకుంటామని చైనా ఇంతకుముందే ప్రకటించింది. అవసరమైతే బలాన్ని ప్రదర్శించేందుకు వెన కాడబోమని లీపెంగ్‌ స్పష్టం చేశారు.తైవాన్‌కిఅన్ని హక్కులు కల్పించింది చైనాయే నని ఆయన అన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో తైవాన్‌పై కూడా చైనా దాడి చేయవచ్చునన్న వార్తలు వెలువడ్డాయి.అయితే, ఉక్రెయిన్‌లో రష్యన్‌ సేనలు ఎదురు దెబ్బలు తినడంతో చైనా తైవాన్‌ విషయంలో వెనుకాడుతోంది. చైనా ఎప్పటికైనా దాడి చేస్తుందేమోనని తైవాన్‌ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.యుద్దం వస్తే ఎలాఎదుర్కోవాలో తమ పౌరులకుశిక్షణ ఇస్తోంది. తైవాన్‌ను చైనా నుంచి ఎవరూ విడదీయలేరంటూ చైనా రక్షణ మంత్రి లీపెంగ్‌ స్పష్టం చేసినదృష్ట్యా తైవాన్‌ మరింత అప్రమత్తమవుతోంది.తైవాన్‌ విషయంలో తమ దేశానికి మద్దతు ఇస్తుందన్న ఆశతోనే, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని చైనా సమర్ధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement