Tuesday, November 19, 2024

అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు..

ప్ర‌భ‌న్యూస్ : చైనాలో మానవహక్కుల హననం జరుగుతోందన్న నెపంతో ఆ దేశంలో జరగనున్న ఒలింపిక్స్‌పై దౌత్యపరమైన బహిష్కరణ నిర్ణయం తీసుకున్న అమెరికాపై జిన్‌ పింగ్‌ ప్రభుతం కారాలుమిరియాలు నూరుతోంది. అమెరికా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్ర హెచ్చరిక చేసింది. బైడెన్‌ ప్రభుత నిర్ణయానికి ప్రతీకారంగా అదే స్థాయిలో చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింజి. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావోలిజియాన్‌ మీడియాతో మాట్లాడుతూ అమెరికా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవాస్తవాలు, అభూతకల్పనలు, అబద్ధాల నేపథ్యంలో సైద్ధాంతిక పక్షపాత ధోరణితో ఒలింపిక్స్‌ బహిష్కరణ నిర్ణయం అమెరికా దుర్బుద్ధికి నిదర్శనమని ఆరోపించారు.

విశ్వక్రీడాసంబరమైన ఒలింపిక్స్‌ రాజకీయా విధానాలకు, రాజకీయ వికారాలకు వేదిక కారాదని అభిప్రాయపడింది. కాగా జిన్‌ జియాంగ్‌ ప్రావిన్స్‌తో ఊగర్‌ ముస్లిం మైనారిటీలపై చైనా దాష్టీకాలకు, ఊచకోతకు పాల్పడుతూండటాన్ని ఎత్తిచూపుతా చైనాలో నిర్వహించే శీతాకాల ఒలింపిక్స్‌కు అమెరికా తరపున ఎటువంటి అధికారబృందాన్ని, దత్యసిబ్బందిని పంపేది లేదని అమెరికా తేల్చి చెప్పిన నేపథ్యంలో చైనా తీవ్రంగా స్పందించింది. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయానికి అమెరికాసహా ప్రపంచదేశాల్లోని మానవహక్కుల సంఘాలు స్వాగతించాయి.

అమెరికా నిర్ణయంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య స్పందించింది. ఇది పూర్తిగా ఆ దేశ రాజకీయ నిర్ణయమని, ఇలాంటి వ్యవహారాలలో కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందని, ఆయా దేశాల నిర్ణయాలను గౌరవిస్తుందని పేర్కొంది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా-చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇరుదేశాల మధ్య వాణిజ్యయుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మరోవైపు కోవిడ్‌19 వైరస్‌ పుట్టకకు చైనాయే కారణమంటూ ట్రంప్‌ పదేపదే చైనాపై విరుచుకుపడ్డారు. అయితే బైడెన్‌ అధికారంలోకి వచ్చాక చైనాతో సంబంధాల మెరుగుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కొన్ని కీలకాంశాలలో చైనాను నిలదీస్తు, చెక్‌ పెడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement