తమ దేశం నుంచి వచ్చే ప్రయాణీకులకు కోవిడ్ పరీక్షలు జరపాలంటూ కొన్ని దేశాలు హెచ్చరికలు జారీ చేయడం పట్ల చైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.అమెరికా,ఆస్ట్రేలియా,కెనడాలతో సహా పన్నెండు దేశాలు ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు విధించాయి. ఇలాంటి ఆంక్షలను తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. తమ దేశం కూడా చైనా వచ్చే వారికి పరీక్షలు జరిపిస్తుందని ఆయన చెప్పారు. చైనాలో ప్రవేశంపై ఆంక్షలకు శాస్త్రీయత లేదని ఆయన స్పష్టం చేశారు., చైనాలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత రోజుకు 9వేల కేసులు పెరుగుతున్నాయంటూ వచ్చిన వార్తలు నిరాధారమనీ,
అలాంటివార్తలను పురస్కరించుకుని తమ దేశంలో పర్యటనలపై ఆక్షలు విధించడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. గత నెల నుంచి ఇంతవరకూ తమ దేశంలో 15 కోవిడ్ మరణాలు సంభవించాయని ఆయన చెప్పారు. తమ దేశం అందిస్తున్న కోవిడ్ కేసులు,మరణాల వివరాలపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.చైనాపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.