Tuesday, November 26, 2024

చెత్తగా పనిచేస్తున్న చైనా వ్యాక్సిన్లు

చైనా దేశం ప్రపంచానికి పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పటికే కరోనా పుట్టినిళ్లుగా పేరు తెచ్చుకుంది. చైనాలో పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇక చైనా వ్యాక్సిన్లు వాడిన దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తుండడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. మంగోలియా, షీషెల్స్‌, బ‌హ్రాన్ లాంటి దేశాల్లో చైనా వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేశారు. ఇప్పుడా దేశాల్లో మ‌ళ్లీ వైర‌స్ కేసులు విజృంభిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం రాసింది. వైర‌స్‌ను సంపూర్ణంగా నియంత్రించ‌డంలో చైనా వ్యాక్సిన్లు విఫ‌ల‌మైన‌ట్లు వివిద దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం రాసింది. చైనా టీకాలు ముఖ్యంగా కొత్త వేరియంట్ల‌పై అస‌లు ప‌నిచేయ‌డం లేద‌ని ఆ రిపోర్ట్‌లో తెలిపారు. షీషెల్స్‌, చిలీ, బ‌హ్రాన్‌, మంగోలియా దేశాల్లో 50 నుంచి 68 శాతం వ‌ర‌కు టీకాలు ఇచ్చేశారు. ఒక‌వేళ చైనా వ్యాక్సిన్లు సరిగ్గా పని చేస్తే ఇప్పుడు మళ్లీ ఎందుకు ఈ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా టీకా తీసుకున్న వారు కూడా ఎక్కువగా ఎందుకు కరోనా బారిన పడుతున్నారు అని అంటున్నారు హాంగ్‌కాంగ్ వ‌ర్సిటీ వైరాల‌జిస్ట్ జిన్ డాంగ్‌యాన్.

ఇక చైనాకు చెందిన వ్యాక్సిన్ సైనోఫార్మ్ కు కరోనా నిర్మూలించే సామర్థ్యం 78.1 శాతం ఉందని, సైనోవాక్ టీకాకు 51 శాతం సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు తేల్చారు. ఇప్పుడు చైనా టీకాల‌ను సుమారు 90 దేశాలు వేసుకుంటున్నాయి. ఈ టీకాలు తీసుకున్న మంగోలియాలో గ‌త ఆదివారం కొత్త‌గా 2400 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే వ్యాక్సిన్ల‌కు మ‌ళ్లీ కేసులు పెర‌గ‌డానికి సంబంధం లేద‌ని చైనా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరిగిన షీషెల్స్‌, మంగోలియా దేశాలు మాత్రం సైనోఫామ్ టీకా బాగున్న‌ట్లు చెబుతున్నాయి. అయితే ఇండోనేషియాలో కొత్త వేరియంట్ వ్యాపిస్తుంది. అక్క‌డ మాత్రం సైనోవాక్ టీకా తీసుకున్న 350 మంది డాక్ట‌ర్లు, హెల్త్ వర్కర్లకు మ‌ళ్లీ పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న కలిగిస్తోంది. బెహ్రాన్‌, యూఏఈ దేశాల్లో కూడా సైనోఫార్మ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి కొత్త కొత్త అనారోగ్య సమస్యలతో పాటు మళ్లీ కరోనా బారిన పడుతున్నట్లు ఓ నివేదికలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement