Saturday, November 23, 2024

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో చైనా సదస్సు

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో చైనా గతవారం కీలక సదస్సు నిర్వహించింది. 19 దేశాలు ఈ భేటీకి హాజరయ్యాయి. షేర్డ్‌ డెవలప్‌మెంట్‌: థియరీ అండ్‌ ప్రాక్టీస్‌ ఫ్రం ది ప్రాస్పెక్టివ్‌ ఆఫ్‌ బ్లూ ఎకానమీ పేరుతో యునాన్‌ ప్రావిన్సులోని కున్మింగ్‌లో సమావేశం జరిగింది. ది చైనా ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కోపరేషన్‌ ఏజెన్సీ (సీఐడీసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

ఇండోనేషియా, పాకిస్తాన్‌, మయన్మార్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మాల్దివులు, నేపాల్‌, అఎn్గానిస్తాన్‌, ఇరాన్‌, ఒమన్‌, ద.ఆఫ్రికా, కెన్యా, మొజాంబిక్‌, టాంజానియా, సీషెల్స్‌, మడగాస్కర్‌, మారిషస్‌, జిబూటీ, ఆస్ట్రేలియా దేశాల ప్రతినిధులు సద్ససులో పాల్గొన్నారు. ప్రస్తుతం సీఐడీసీఏకు విదేశాంగశాఖ మాజీ సహాయమంత్రి లూ ఝాహి అధ్యక్షత వహిస్తున్నారు. విదేశీ సాయానికి అవసరమైన ప్రణాళికలు, విధానాలు, వ్యూహాల రూపకల్పనకు ఈ సదస్సు నిర్వహించినట్లు చెబుతున్నారు. సముద్ర విపత్తుల నివారణ, తీవ్రత తగ్గించడానికి అవసరమైన సహకారానికి సంబంధించి చైనా కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement