Saturday, November 23, 2024

China Masters | రేపటినుంచి చైనా మాస్టర్స్‌…

చైనా మాస్టర్స్ 16వ ఎడిషన్ రేపు (నవంబర్ 21) ప్రారంభం కానుంది. కాగా, జపాన్ ఓపెన్ సూపర్ 500 రెండో రౌండ్‌లో ఓడిన ప్రణయ్.. రేపు ప్రారంభం కానున్న చైనా మాస్టర్స్ ఈవెంట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 నాటికి టాప్ 16లో చోటు సంపాదించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పోరాడుతున్న లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్‌లు కూడా బరిలోకి దిగనున్నారు.

ఇక, ఈ టోర్నమెంట్‌లో మొత్తం 64 మంది సింగిల్స్ ప్లేయర్‌లు, 96 డబుల్స్ జట్లు పోటీపడుతుండగా.. భారతదేశం నుండి 5 సింగిల్స్ ప్లేయర్‌లు, రెండు డబుల్స్ జట్లు ఎంపికయ్యాయి. భారత్‌కు తరుఫున సింగిల్స్ షట్లర్‌లలో ఆకర్షి కశ్యప్, లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రియాంషు రజావత్ ఉన్నారు. అయితే, మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి చైనా మాస్టర్స్ లో పోటీపడుతున్న ఏకైక భారతీయురాలు ఆకర్షి కశ్యప్ కావడం విశేషం.

అదేవిధంగా, మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి అలాగే మహిళల డబుల్స్‌లో రుతపమ-శ్వేతపర్ణ పాండస్‌లు భారత డబుల్స్ జోడీలుగా ఆడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement