ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న హాంగ్‌జౌలో శనివారం నాడు క్రీడాగ్రామాలను ప్రారంభించారు. క్రీడా త్రినిధుల బృందానికి ఇది స్వాగత వేడుకగా కూడా ఉంది. మేయర్ లి హుయోలిన్ క్రీడాగ్రామాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు ఉన్నతస్థాయి సేవలు అందించడానికి తమవంతు కృషిచేస్తారని అన్నారు. హాంగ్‌జౌ ఆసియా గేమ్స్‌లో అతిపెద్ద క్రీడారహిత వేదికగా అథ్లెట్లగ్రామం, టెక్నికల్ ఆఫీసర్ల గ్రామం, మీడియా గ్రామాలు వ్యవహరిస్తాయని జిన్హువా నివేదించింది.
హాంగ్‌జౌలో జరిగే 19వ ఆసియా క్రీడల సందర్భంగా, ఈ క్రీడా గ్రామాలలో 20వేల మందికిపైగా క్రీడాకారులు, జట్ల సహాయక, సాంకేతిక సిబ్బందితోపాటు జర్నలిస్టులకు వసతి, క్యాటరింగ్, రవాణా, వైద్యసేవలు మొదలైనవి కల్పిస్తారు. నింగ్బో, వెంజౌ, జిన్హువా, టాంగ్లు, చున్‌యాన్‌లోని ఐదు ఉప-గ్రామాలు, అలాగే, షోగ్జింగ్, లిన్‌యాన్, గ్జియాషాన్‌లలో మూడు అథ్లెట్ల రిసెప్షన్ హోటళ్లు కూడా ప్రారంభించబడ్డాయి.