కరోనా నుంచి కోలుకున్న చైనాను వరుస పెట్టి సంక్షోభాలు ముంచెత్తున్నాయి. మొన్నటి వరకు ఎవర్ గ్రాండ్ సంక్షోభంతో అతలాకుతలమయిన చైనాలో మరోక సంక్షోభం బయటకు వచ్చింది. కరోనా నుంచి చైనా బయటపడుతున్న సమయంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ను కట్ చేశారు. 2020 తో పోలిస్తే 2021లో వినియోగం 13శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగినంతగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి రంగంపై ప్రభావం కనిపించే అవకాశం ఉన్నది. చైనాలో ఉత్పత్తి రంగం కుదేలైతే దాని ప్రబావం ఆ ఒక్కదేశంలో మాత్రమే కాకుండా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాలపై పడుతుంది. కరెంట్ ఉత్పత్తి తగ్గిపోవడానికి బోగ్గు కొరత తీవ్రంగా ఉండటం మరోక కారణంగా చెబుతున్నారు. చైనాలో విద్యుత్ ఉత్పత్తి బొగ్గుపై ఆధాపడి ఉంటుంది. అయితే, పర్యావరణాన్ని తగ్గించేందుకు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తగ్గిస్తూ వస్తున్నారు. అంతేకాదు, బోగ్గుకోసం చైనా ఆస్ట్రేలియాపై ఆధారపడింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా అక్కడి నుంచి బోగ్గు దిగుమతి తగ్గిపోవడంతో చైనాలో కరెంట్‌కు తీవ్రమైన ఇబ్బందులు వచ్చిపడ్డాయి. విద్యుత్ కొరత ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో చైనా మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఈ క్రిస్మస్ కే ఆర్ఆర్ఆర్ విడుదల..? రెండు రోజుల్లో క్లారిటీ..!