చైనా ప్రభుత్వం పై ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజం జాక్సి మా చేసిన వ్యాఖ్యల పర్యావసనము ఆయనను ఇంకా వెంటాడుతున్నట్టే ఉంది. ఇప్పటికే పలు బిలియన్ డాలర్ల కాంట్రాక్టు లు ఆలీబాబాకు దక్కకుండా చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యక్షంగా ఆలీబాబా కంపెనీలపై కొరడా ఝుళిపిస్తోంది. మార్కెట్ గుత్తాధిపత్య నిబంధనల ఉల్లంఘించిందన్న కారణంగా ఈ గ్రూప్‌పై ఏకంగా 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,300 కోట్లు) జరిమానా విధించాలని చైనా ప్రభుత్వం యోచిస్తోందట. దాంతో చైనాలో అత్యధిక జరిమానా విధించిన కంపెనీ అలీబాబా కానుంది. చైనాలో పోటీ ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి అమెరికన్ చిప్ తయారీ కంపెనీ క్వాల్‌కామ్ 2015లో 97.5 కోట్ల డాలర్ల పెనాల్టీ చెల్లించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement