బీజింగ్: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ (68) కన్నుమూశారు. గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున ఆయన మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఈ ఏడాది మార్చిలో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. అనంతరం ఆయన షాంఘైలో విశ్రాంతి తీసుకొంటున్నారు.
జిన్‌పింగ్ పదవీకాలం మూడోసారి పొడిగించకపోతే.. లీ కెకియాంగ్ ఆ స్థానానికి పోటీపడే ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. ఈ ఏడాది జిన్‌పింగ్ ఆయన్ను పక్కనపెట్టి.. లీ చియాంగ్‌ను ప్రధానిగా చేశారు. పేకింగ్ యూనివర్శిటీలో లీ కెకియాంగ్ ఆర్థికవేత్తగా పనిచేశారు. స్వేచ్ఛా మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కెకియాంగ్ సమర్థించేవారు. కానీ, జిన్‌పింగ్ మాత్రం మార్కెట్‌పై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకొనేవారు