Saturday, November 23, 2024

పాక్‌లో చైనా దౌత్య కార్యాలయం మూసివేత

పాకిస్థాన్‌లోని తమ దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 13 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాకిస్థాన్‌లోగల తమ రాయబార కార్యాలయంలోని దౌత్య విభాగం తాత్కాలికంగా మూసి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నది. సాంకేతికపరమైన సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. అయితే, కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు సరిగా లేవని, ఆ దేశంలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని చైనా హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

పాకిస్థాన్‌లో గత ఏడాదికాలంగా ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయని, అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబన్‌లు తరచూ దాడులకు పాల్పడుతున్నం దున చైనా పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆరోజు చేసిన హెచ్చరిక ప్రకటనలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌ రాయబార కార్యాలయంలోని తమ దౌత్య విభాగాన్ని మూసివేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతాలోపం కారణంగానే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement