చైనాలో కరోనా విలతాండవం చేస్తోంది. రోజుకు కోట్లలో కేసులు నమోదవుతుండడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి తోడు మరణాల సంఖ్య కూడా రోజులు వేలలో ఉండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఇకపై రోజువారీ గణాంకాలు వెల్లడించేది లేదని నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) ప్రకటించింది. గత కొంతకాలంగా ఎన్‌హెచ్‌సీనే దేశంలోని కేసుల సంఖ్యను వెల్లడిస్తూ వస్తున్నది. ఇకపై చైనీస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఫర్ రెఫరెన్స్ అండ్ రిసెర్చ్ .. కరోనా కేసులను వెల్లడిస్తుందని పేర్కొన్నది. అయితే సీడీసీ ఎప్పటినుంచి ఈ సమాచారం అందిస్తున్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
China covid update: చైనాలో కరోనా విలయతాండవం… రోజువారీ కేసులు చెప్పేది లేదన్న ఎన్‌సీహెచ్..
Advertisement
తాజా వార్తలు
Advertisement