Tuesday, November 26, 2024

China Corona Cases : చైనాలో క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త కేసులు ఎన్నంటే?

కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి కొవిడ్ కలకలం రేగింది. చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చైనా ప్రధాన భూభాగంలో కరోనా బాధితుల సంఖ్య 3,72,964కు చేరింది. బీజింగ్‌, షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్‌ వంటి ప్రధాన నగరాల్లో ప్ర‌భుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ప్ర‌జ‌లు నుంచి తిరుగుబాటు మొద‌లైంది. దీనికి తోడు క‌రోనా కేసులు కూసు కొంత మేర త‌గ్గుతుండడంతో నిబంధ‌న‌లు స‌డ‌లించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కొన‌సాగిస్తే ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement