Monday, November 18, 2024

25 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటే యువ‌తికి న‌గ‌దు రివార్డ్ ..

బీజింగ్ – చైనాలో జననాల రేటు భారీగా పడిపోతుండడంతో నవదంపతులకు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. వధువు వయసు 25 ఏళ్లు, అంతకంటే తక్కువ ఉంటే 1000 యువాన్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 11 వేలకుపైగా) నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. చాంగ్‌షన్ కౌంటీ ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వియ్‌చాట్‌లో ప్రకటించింది. వయసులో ఉండగానే వివాహం, తద్వారా సంతానాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అలాగే, పిల్లలున్న దంపతులకు పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి, విద్యలో రాయితీలు కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement