అమరావతి, ఆంధ్రప్ర్రభ:గుంటూరులోని లాంఫారంలో ఉన్న డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం ప్రాంగణంలోఈనెల 15,16న రైతులకు నాణ్యమైన మిర్చి విత్తనాలను విక్రయించనున్నట్టు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.గిరిధర్ తెలిపారు. ఎల్.సి.ఏ -643, ఎల్.సి.ఏ – 657 (క్రాంతి) రకం విత్తనాలను విక్రయించనున్నట్టు వెల్లడించారు. 657 రకం కాయలు పొడవుగా, ముదురు ఆకపచ్చ రంగు, తెల్లటి తొడిమతో ఆకర్షణీయంగా ఉంటుంది.. మిర్చికి ప్రధానం వ్యాపించే జెమినీ వైరస్ (బొబ్బ) వ్యాధినికి తట్టుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
ఎస్.సి.ఏ – 643 రకం పొడవుగా ఎండుకాయల కడ్డీ బ్యాడిగిలా ఉంటాయన్న సంగతిని రైతులు గమనించాలన్నారు. ఈ రకం ఎరుపు రంగుతో ఘాటుగా ఉంటాయి. కొంతవరకు జెమినీ వైరస్ తో పాటు బెట్టను తట్టుకోవటమే కాకుండా నల్లతామర ఆశించినా దిగుబడి పై ప్రభావం చూపించకుండా ఎస్.సి.ఏ – 643 రకం ఉపయోగపడుతుందన్నారు.