జనవరి 3 నుంచి పిల్లలకు టీకా ప్రారంభమవుతున్నందున 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ… ప్రజలు అలసత్వం వహిస్తూ నిబంధనలు పాటించకుంటే కొవిడ్ మహమ్మారిని నియంత్రించలేమన్నారు. వైరస్ రూపు మార్చుకుంటూ విజృంభిస్తున్నందున జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పనిచేస్తే కొవిడ్ పోరులో విజయం సాధిస్తామన్నారు. అలాగే గడువు ముగిసినా రెండో డోసు తీసుకోని వారందరూ వెంటనే తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital