భూపాలపల్లి, ప్రభన్యూస్ : పిల్లల భద్రత మనందరి బాధ్యత అనే నినాదంతో ఆపదలో ఉన్న పిల్లల సంరక్షణ నిమిత్తం 1098 బాల రక్షక్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ భవిష్ మిశ్రా శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు బాల రక్షక్ వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధతో పిల్లల రక్షణలో 33 జిల్లాలకు ఈ బాల రక్షక్ వాహనాలు కేటాయించడం జరిగిందని.. అందులో భాగంగానే మన జిల్లాకు కూడా కేటాయించడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ.. బాలల సంరక్షణ ధ్యేయంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అహర్నిశలు పనిచేస్తుందని వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్న పిల్లల రక్షణ నిమిత్తం 1098 కాల్ చేసిన నిమిషాల వ్యవధిలో ఈ వాహనం అక్కడికి విచ్చేసి ఆపదలో ఉన్న బాలలను రక్షించడం జరుగుతుందన్నారు. పిల్లల సంరక్షణలో భాగస్వాములై పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital