జనగామ జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్న డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో చలాన్ కట్టి ఇక్కడి నుంచి కదలాలని పోలీసులు హుకూం చారీ చేశారు. 45 నిమిషాల పాటు ఆ కారును రోడ్డపైనే నిలిపివేశారు. చిన్నారి అనారోగ్యంతో ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని ఎంతగానో వేడుకున్నప్పటికీ పోలీసులు వదలలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పరిస్థితి మరింత విషమించి కన్నుమూశాడు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యం కావడంతోనే తమ బాలుడు మరణించినట్లు తల్లి వాపోయింది. పోలీసుల అత్యుత్సాహం కారణంగానే తమ కుమారుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసుల తీరుపై తల్లిదండ్రులతోపాటు స్థానికులు మండిపడ్డారు. పోలీసులు మాత్రం డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కారును ఆపామన్నారు. కారులో బాలుడు అనారోగ్యంతో ఉననట్లు మాకు తెలపలేదని పోలీసులు వివరణ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement