Tuesday, November 19, 2024

టీకా వికటించి చిన్నారి మృతి

చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం గంధబోయినపల్లి పంచాయతీకి చెందిన శైలజ, సుధాకర్ అనే దంపతులకు రెండు నెలల క్రితం ఆడ శిశువు జన్మించింది. చిన్నారికి నెల టీకా వేయించడం కోసం గడమానపల్లెకు వెళ్లిన చిన్నారి తల్లి శైలజ అక్కడున్న వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు ఉషారాణి, రెడ్డెమ్మలను అశ్రయించారు. వారు పలుమార్లు రేపు, మాపంటూ తప్పించుకుని పక్క పంచాయతీ మూరెవాడ్లపల్లెకు శైలజను పిలిపించి చిన్నారికి టీకా వేశారు. టీకా సరిగా వేయని కారణంగా ఆ టీకా వికటించడంతో రెండు రోజుల క్రితం చిన్నారి మృతి చెందింది.

కాగా ఈ వ్యవహారంపై బాధితులు నిలదీయడంతో నిందితులు తప్పించుకోవడానికి యత్నించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామణి బెదిరిస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై ఉన్నతధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. బాధ్యలుపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement