పటాయా – కాసీనో నిర్వహిస్తూ కొన్ని నెలల క్రితం ప్రధాన వార్తల్లో నిలిచిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో అరెస్టు అయ్యాడు. అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా థాయ్ పోలీసులు దాడులు నిర్వహించడంతో చికోటి చిక్కాడు. చికోటి ప్రవీణ్‌తో పాటు పోలీసులు మరో 93 మందిని అరెస్టు చేశారు. ఇందులో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. పారిపోయేందుకు చికోటి ప్రయత్నించగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు
గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపించని చికోటి ప్రవీణ్ పేరు మళ్లీ తెరపైకొచ్చింది.థాయ్‌లాండ్‌లోని పటాయాలో ఏప్రిల్ 27వ తేదీన హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్‌ను అద్దెకు తీసుకుని అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. గ్యాంబ్లింగ్ ఆడుతున్న వారిలో భారతీయులతో పాటు నేపాల్, మయన్మార్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ గ్యాంబ్లింగ్ నిర్వహణలో 32 ఏళ్ల మహిళ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం .థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహించేందుకు మొత్తం రూ.3 లక్షలు వసూలు చేసిన చికోటి ప్రవీణ్ ఒక్కో భారతీయుడి నుంచి రూ.50 వేలు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నిందితుల నుంచి పోలీసులు సుమారు రూ.20 కోట్లు విలువ చేసే గ్యాంబ్లింగ్ చిప్స్‌తో పాటు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు