చికోటి ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ చికోటి ప్రవీణ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 2 ప్లస్ 2 గన్ మెన్ల రక్షణ కోరుతూ చికోటి ప్రవీణ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా… చికోటి ప్రవీణ్ ఇంటి ముందు అనుమానాస్పద వ్యక్తులను చికోటి అనుచరులు గుర్తించారు. సైదాబాద్ పీఎస్ లో చికోటి ప్రవీణ్ న్యాయవాది ఫిర్యాదు చేశారు. చికోటి ఇంటి ముందు భారీగా అనుచరులు మొహరించారు.