- ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీస్తాం
- ఎక్కడ భూకబ్జాలకు పాల్పడలేం
- మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ
- బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయబద్ధంగా భూముల సేకరించాం
జోగిపేట, నవంబర్ 21 (ఆంధ్రప్రభ) : భూకబ్జాల కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గురువారం అందోల్ మండల పరిధిలోని మాసానిపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మాణం చేపట్టిన పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడి నిలదీస్తుందని అన్నారు.
రైతుల పట్టా పాస్ బుక్కులు తీసుకొని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి పట్టా భూమిని రైతుల దగ్గర 13ఎకరాల భూమిని కొనుగోలు చేశామే తప్ప.. ఎక్కడ కూడా ఓ గుంట గానీ, ఎకరా గానీ భూమిని కబ్జా చేయలేమన్నారు. భూకబ్జాలు చేసిన చరిత్ర మీదని ఆరోపించారు. రైతులకు, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఉంటుందన్నారు.
ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష హోదాలోనే ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వెంట అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, రాష్ట్ర మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయికుమార్, పార్టీ నాయకులు డిబి.నాగభూషణం, చాపల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.