అద్భుత అలంకృత రూపం లో తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం ఆకట్టుకోవాలని, దేశానికే వన్నె తెచ్చే విధంగా అద్భుతంగా ఉండా లని, పది కాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రెటె రియలు పటిష్టమైన రీతిలో నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల
పురోగతిని సీఎం గురువారం పరిశీలించారు. సచివాలయ
నిర్మాణంలో, సుందరీకరణ కోసం, వినియోగించేందుకు
రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్మండ్ స్టోన్, బీజ్ స్టాండ్
స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతాన్ని కాలినడకన కలియ తిరిగి, నిర్మాణంలో ఉన్న పిల్లర్లను, భీమల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. ఆర్లాండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రగతి భవన్లో సెక్రెటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి,సంక్షేమ రంగాల్లో దేశానికి మార్గదర్శిగా పాలన సాగు తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే
విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలువాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి.విశాలమైన అంతర్గత రోడ్లు, పలు రకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటుచేసుకోవాలి.పార్లమెంట్ రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న మాదిరి ధోల్ పూర్ స్టోతో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను తెలంగాణ నిర్మించుకోవాలి. అన్ని హంగులతో సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల తేజ తదితరులు పాల్గొన్నారు.