ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ముండ్కా ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఇక.. ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి రూ.50 వేలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు లభించిన మృతదేహాల్లో 25 మంది మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ 25 డెడ్‌బాడీల గుర్తింపునకు డీఎన్ఏ శాంపిళ్లను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారని పేర్కొన్నారు. డీఎన్ఏ టెస్టుల అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement