విమాన ఛార్జీలు భారీగా పెరగడం పట్ల మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రభుత్వం పై పైర్ అయ్యారు. చెన్నయ్- ఢిల్లి బిజినెస్ క్లాస్ ఎయిర్ టికెట్స్ రెండు ఎయిర్‌లైన్స్‌లో చాలా రిజనబుల్ రేట్లు 63,000, 57,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఆయన వ్యంగ్యంగా ట్విట్ చేశారు. సాధారణంగా డిమాండ్ పెరిగితే రేట్లు పెరుగుతాయని చెప్పారు. విమానయాన సంస్థలు కొత్త రూట్స్‌కు విమానాలు నడుపుతూ, పాత రూట్లలో సర్వీస్‌లు తగ్గిస్తున్నారని, రేట్లు పెంచుతున్నారని విమర్శించారు.
ఢిల్లి- చెన్నయ్ సర్వేస్‌లు నడిపే విస్తారా, ఎయిర్ ఇండియా విమానాల్లో ఈ వేరి రిజనబుల్ రేట్లు ఉన్నాయని ట్విట్ చేశారు. సాధారణంగా స్వేచ్ఛయుత ఆర్ధిక వ్యవస్థల్లో డిమాండ్ పెరిగితే సప్లయ్ పెరుగుతుందని, ఇండియా ఫ్రీ మార్కెట్‌లో మాత్రం డిమాండ్ పెరిగితే రేట్లు పెరుగుతున్నాయని విమర్శించారు. గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానంపై ఇండియా విశ్వగురువు అవుతుందని చిదంబంరం పేర్కొన్నారు.