Saturday, November 23, 2024

Chhattisgarh : ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి..?

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇవాళ‌ పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెంది ఉండొచ్చు.. లేదా గాయాల‌పాలై ఉండొచ్చ‌ని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు మృత‌దేహాలు ల‌భ్యం కాలేద‌న్నారు. చింత‌గుఫా, కిష్టారం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని చోటేకేద్వాల్ గ్రామ స‌మీపంలోని అడ‌వుల్లో మావోయిస్టులు ఉన్న‌ట్లు పోలీసులకు ప‌క్కా స‌మాచారం అందింది. డివిజ‌న‌ల్ క‌మిటీ మెంబ‌ర్, కిష్టారం ఏరియా క‌మిటీ ఇంచార్జి రాజుతో పాటు 30 నుంచి 35 మంది మావోయిస్టులు స‌మావేశ‌మైన‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది.

దీంతో అక్క‌డ పోలీసులు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. దీంతో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య గంట పాటు ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో న‌లుగురి నుంచి ఆరుగురు మావోయిస్టులు మృతిచెంది ఉండొచ్చు. లేదా గాయ‌ప‌డి ఉండొచ్చు అని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement