Tuesday, December 17, 2024

Chhattisgarh | భారీ ఎన్‌కౌంటర్.. 35 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దుల్లో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో 35 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొంది. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement