ఇవ్వాల (మంగళవారం) అజర్బైజాన్లోని బాకులో జరిగిన FIDE ప్రపంచకప్ ఫైనల్లో ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద, మాగ్నస్ కార్ల్సన్లు ఒకటో రౌండ్ని డ్రాగా ముగించారు. గేమ్ లోని 35వ మూవ్ వద్ద పరస్పర అంగీకారంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు (0.5-0.5) అంగీకరించారు.
ఇక రేపు (బుధవారం) జరగనున్న ఫైనల్ లోని రెండో రౌండ్ మరోసారి తలపడనున్నారు ఈ గ్రాండ్ చెస్ మాస్టర్స్. అయితే, రేపు జరగనున్న మ్యాచ్ లో కూడా రెండో క్లాసికల్ రౌండ్ ముగిసే సమయానికి స్కోర్లు ఒకే స్థాయిలో ఉంటే మ్యాచ్ గురువారం టైబ్రేక్స్లోకి వెళుతుంది.