అజర్‌బైజాన్‌లోని బాకులో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెస్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రగ్నానంద, ప్రపంచ నం.1 గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. కార్ల్‌సెన్‌తో ప్రజ్ఞానానంద పోటీపడడం ఇది 20వ సారి.
సోమవారం జరిగిన సెమీ-ఫైనల్‌లో అమెరికాకు చెందిన ప్రపంచ నం.3 ఆటగాడు ఫాబియానో కరువానాను ఓడించాడు భారత చెస్ ప్లేయర్ ప్రగ్నానంద. ఒకే టైబ్రేక్ విజయంతో సెమీ-ఫైనల్‌లో 3.5-2.5తో ఫాబియానో కరువానాను ఓడించిన 18 ఏళ్ల ప్రగ్నానంద.. పైనల్స్ కి చేరిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపుపొందాడు. ఫైనల్‌కు చేరిన చివరి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ ఉన్నారు. అతను చెస్ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు ప్రపంచకప్ (2000, 2002లో) విజేతగా నిలిచాడు.