ఐపీఎల్ 2023 33వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కోల్కతా పై సిఎస్కే విజయం సాదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీకెఎస్కే జట్టు కోల్కతా కి 236 పరుగుల లక్ష్యాన్ని అందించింది. నిర్ణీత 20 ఓవర్లలో 236 పరుగులు చేయాల్సి ఉండగా.. 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కోల్కతా ఓపెనర్ నారాయణ్ జగదీశన్, సునీల్ నరైన్ 3 బంతులు ఆడి అవుట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా 20 బంతుల్లో 20, 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక, కొల్ కతా జట్టులో జాసన్ రాయ్ త్యధికంగా 5 ఫోర్లు, 5 సిక్స్ లతో 61 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తన అద్బుతమైన నాక్స్ తో పరుగులు 33 బంతుల్లో 53 జోడించి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇక జాసన్ రాయ్ అవుట్ అవ్వడంతో బ్యాటింగ్ కు దిగిన రస్సెల్ 6 బంతుల్లో 9 పరుగులు చేసి పెవెలియన్ బాట పట్టాడు… ఆపై క్రీస్ లోకి వచ్చిన డేవిడ్ వైస్ కూడా 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. ఇక ఏడో వికెట్ గా ఉమేష్ యాదవ్ రాగా… 4 బంతుల్లో 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన వరుణ్ చక్రవర్తి 3 బంతుల్లో 0 పరుగులు.
జాసన్ రాయ్, రింకూ సింగ్ మినహా ఆ జట్టులోని బ్యాట్స్మెన్ ఎవరూ కూడా అధిక పరుగులు చేయలేకపోయారు. చెన్నై దూకుడుకి కోల్కతా బ్యాటర్లు చేతులెత్తేసారనే చెప్పాలి. ఇక, చెన్నై తరఫున అత్యధికంగా తుషార్ దేశ్పాండే 2, మహేశ్ తీక్షణ 2 వికెట్లు తీశారు. దీంతో పాటు ఆకాశ్ సింగ్, రవీంద్ర జడేజా, మహిష్ తీక్షణ, మొయిన్ అలీ, మతిష పతిరనా 1-1 వికెట్లు తీశారు.
ఇక, ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్స్ గా వచ్చిన రుతురాజ్ 20 బంతుల్లో 35 చేయగా, కాన్వే తన ఫామ్ ను కొనసాగిస్తూ.. 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన శివమ్ దూబే 21 బంతుల్లో 50 అర్థ శతకంతో మెరిసాడు. అజింక్య రహానే 29 బాల్స్ 71 రన్స్ తో అర్థ శతకం చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇక జడేజా 8 బంతుల్లో 18 రన్లు చేసి అవుట్ అవ్వగా.. చివరిగా వచ్చిన ధోనీ 3 బాల్స్ లో 2 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ని ముగించేశాడు.