Friday, November 22, 2024

సీఎంపై తప్పుడు ప్రచారం.. ఆలయాలను పడగొడుతున్నట్టు పోస్టులు.. ఇద్దరు అరెస్టు..

అల్లర్లు సృష్టించేలా.. ప్రజల్లో అశాంతిని కలిగించేలా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు వినోజ్​ పి సెల్వంపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు చెన్నై పోలీసులు. కిల్​పాక్​కు చెందిన ఇళంగోవన్​, వినోజ్​ పి సెల్వం ఇద్దరూ కలిసి ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తున్నారని, కావాలనే సామాజిక అంశాలను పేర్కొంటూ రెచ్చగొడుతున్నారని పోలీసులు తెలిపారు. అట్లాంటి అంశాలను ట్విట్టర్​, ఫేస్​ బుక్​లో పోస్టు చేస్తూ అశాంతిని కలిగిస్తున్నారని వారిపై యాక్షన్​ తీసుకుంటున్నామన్నారు. దీనిపై చెన్నై పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదులు అందాయన్నారు.

కాగా, వినోజ్ పి సెల్వం చేసిన ట్వీట్‌ను ఇళంగోవన్ షేర్​ చేసుకున్నారు.  అందులో అతను బుల్‌డోజర్ పక్కన నిలబడి ఉన్న సీఎం స్టాలిన్‌ను పోలిన క్యారికేచర్‌ను పెట్టారు.  మరో రెండు బుల్డోజర్లు ఆలయ గోపురాన్ని (ఆలయాల ప్రవేశద్వారం వద్ద ఉన్న స్మారక గోపురం) కూల్చివేస్తున్నట్టు క్రియేట్​ చేశారు. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా  తమిళనాడు స్వాతంత్ర్య సమయంలో అనే క్యాప్షన్​తో శకటాలను ప్రదర్శించిన130 హిందూ దేవాలయాలను కూల్చివేసినట్లు  తప్పుడు ప్రచారం నిర్వహించినట్టు కంప్లెయింట్​ అందింది.  స్వాతంత్య్ర పోరాట కాలంలో కంటే హిందూమతం అణచివేయబడుతోంది. అని సుపరిపాలన కోసం దయచేసి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వండి అని వినోజ్ పి సెల్వం తన ట్వీట్ లో పోస్టు చేశారు.  ప్రజల్లో అశాంతిని కలిగించే ఉద్దేశ్యంతో ఫేస్‌బుక్, వాట్సాప్ , ట్విట్టర్‌లో ఎవరైనా తప్పుడు ప్రచారాలను  షేర్ చేసినా వారిపై కఠిన చర్యలుంటాయని  సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement