Monday, November 18, 2024

CSK vs KKR | కోల్​కతాపై చెన్నై బౌలర్ల అటాక్​.. సీఎస్​కే టార్గెట్​ ఎంతంటే?

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు తడబడ్డారు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా, తుషార్ దేశ్‌పాండే చెరో 3 వికెట్లతో చెలరేగారు. బౌలర్లు రాణించడంతో.. కేకేఆర్‌‌ను 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే కట్టడి చేయగలిగింది చెన్నై జట్టు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్(0) తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత 24 పరుగులు చేసిన రఘువంశీ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అదే ఓవర్లో 27 పరుగులు చేసిన నరైన్ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వెంకటేశ్ అయ్యర్(3)ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

- Advertisement -

దీంతో కోల్‌కతా 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రమణ్‌దీప్ 13 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 85 పరుగులకే కోల్‌కతా సగం జట్టును కోల్పోయింది. ఆ తరువాత రింకూ సింగ్ 9 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 113 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత రస్సెల్ 10 పరుగులు చేసి భారీ షాట్‌కు యత్నించి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 34 పరుగులు చేసిన అయ్యర్ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఫలితంగా 20 ఓవర్లలో కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమవ్వగా సీఎస్‌కే జట్టు 138 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement