Monday, November 18, 2024

Chennai – నిన్న గురువులు..నేడు కోచ్ లు … అంద‌రూ మృగాళ్లే..

చెన్నై – గురువు అనే పేరుకు కళంకం తీసుకువ‌చ్చిన మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన విద్యార్థికి విద్యాలు నేర్పించాల్సిన ఒక గురువు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ బాలిక న‌గ్న ఫొటోల‌ను పంపాలంటూ కోరాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. విష‌యం వెలుగులోకి రావ‌డంతో పోలీసులు నిందితుడైన బ్యాండ్మింట‌న్ కోచ్ ను ఆరెస్టు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. కోయంబత్తూర్‌లోని ఒక ప్ర‌యివేటు పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ బ్రూన్ వాట్సాప్‌లో తమ నగ్న చిత్రాలను పంపమని బాలికను కోరిన ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సౌరిపాలేనికి చెందిన నిందితుడు అరుణ్ బ్రూన్ (28) మరికొంత మంది విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడనీ, వారి న‌గ్న‌ ఫోటోలు తనకు పంపమని అడిగాడని పోలీసులు తెలిపారు.


రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన బ్రన్, హోప్ కాలేజ్ సమీపంలోని కామరాజర్ రోడ్‌లోని బ్యాడ్మింటన్ అకాడమీతో అనుబంధం కలిగి ఉన్నాడు. గత ఆరు నెలలుగా నగరంలోని ఒక ప్ర‌యివేటు పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. బ్యాడ్మింటన్ కోచ్ పదకొండో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను తన వాట్సప్ నంబర్ కు ఫోటోలు పంపాలని కోరాడు. ఆ అమ్మాయి తన సాధారణ ఫోటోను పంపిన త‌ర్వాత నగ్న ఫొటోలను పంపాలని కోచ్ బాలికను కోరాడు. అయితే, బాలిక పంప‌లేదు. వాట్సాప్‌లో తన నగ్న ఫోటోలను పంపమని బాలిక‌ను మ‌ళ్లీ కోర‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు బ్రూన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. ఈ సెంట‌ర్ లో శిక్ష‌ణ పొందుతున్న బాలిక‌ల న్యూడ్ ఫోటోలు అత‌డి సెల్ ఫోన్ లో వెలుగు చూడ‌టంతో అతడిపై మ‌రికొన్ని సెక్ష‌న్ లు చేర్చి కోర్టులో హాజ‌రుప‌రిచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement