గౌహతి: భారతీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ఇవాళ అరుణాచల్ ప్రదేశ్‌లో కూలింది. ఆ రాష్ట్రంలోని మండలా ప్రాంతంలో అది కూలింది. దాంట్లో ఉన్న ఇద్దరు సిబ్బంది కనిపించకుండాపోయారు. లెఫ్టినెంట్ కల్నల్‌తో పాటు ఓ మేజర్ కూడా మిస్సైనట్లు భావిస్తున్నారు. ఉదయం 9.15 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో ఆ హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమిడిలా వద్ద ఆపరేషనల్ సోర్టీ నిర్వహిస్తున్న సమయంలో చీతా హెలికాప్టర్‌తో కాంటాక్ట్ తెగిపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది, ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్లను బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించారు. మరోకరు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement