Friday, November 22, 2024

TG | డీజీపీకి కేసీఆర్ ఫొన్ ?

జన్వాడ రేవ్ పార్టీ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్‌కు కేసీఆర్ ఫోన్ చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారని డీజీపీని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని కేసీఆర్ నిలదీసినట్లు తెలుస్తోంది. సోదాలను వెంటనే ఆపాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం.

మరోవైపు రాయదుర్గం లోని శైలేంద్రకు చెందిన ఓరియన్ విల్లాస్‌లో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు ముగిశాయి. దాదాపు 3 గంటలపాటూ ఈ తనిఖీలు చేశారు. అటు రాజ్ పాకాల ఇంటి తాళాలను కూడా పగలగొట్టి తనిఖీలు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజ్ పాకాల పరారీలో ఉన్నారు.

ఇక శైలేంద్ర ఇంటి దగ్గర తనిఖీలు చెయ్యనివ్వకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అరెస్టైన వారిలో వివేకానంద, బాల్కసుమన్, పల్లా, సంజయ్, క్రిశాంక్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement