Thursday, November 21, 2024

విదేశీ విద్య కోసం విద్యార్థికి చెక్కు అందించిన – మంత్రి నిరంజ‌న్ రెడ్డి

డీసీసీబీ ద్వారా విదేశీ విద్య‌కోసం రుణం అందుకున్నాడు తొలి విద్యార్థి క‌ర‌కాల హేమంత్ రెడ్డి. కాగా ఈ విద్యార్థిని స‌న్మానించి రూ.23ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే సీఎం కేసీఆర్‌ తపన అన్నారు. పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద రూ.20 లక్షల సాయం ప్రభుత్వం అందజేస్తున్నది. కాగా, ఇప్పుడు డీసీసీబీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. గతంలో ఆర్థిక చేయూత లేక ఉన్నత చదువులకు, విదేశీ విద్యకు దూరమైన విద్యార్థులు డీసీసీబీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement