అమరావతి, ఆంధ్రప్రభ : చిట్‌ఫండ్స్ సంస్థలు చేస్తున్న మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ- చిట్స్ సేవలకు శ్రీకారం చుట్టింది.. రాష్ట్రవ్యాప్తం గా ప్రముఖ సంస్థలు కూడా డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించటం.. ఖాతాదారులకు నష్టం కలిగించటం ద్వారా అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇకపై చిట్ ఫండ్ సంస్థల లావాదేవీలన్నీ పాదరదర్శకంగా ఉండేలా ఆన్‌లై న్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. సంబందిత నూతన ఎలక్ట్రాన్రిక్ అప్లికేషన్ ను సచివాలయంలో మంత్రి సోమవారం రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంఛంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ధర్మాన మట్లాడుతూ చిట్ ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు మోసాలకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో రాష్ట్రంలో ఈ-చిట్స్ సేవలను అమల్లోకి తెచ్చిందన్నారు.
రాష్ట్ర రిజిస్ట్రేష్రన్లు, స్టాంప్స్ విభాగం రూపొందించిన ఈ నూతన ఎలక్ట్రాన్రిక్ విధానాన్ని రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీలు అన్ని ఇకపై తప్పని సరిగా అనుసరించాల్సి ఉందన్నారు. చిట్ ఫండ్ లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉందని, రిజిస్ట్రేష్రన్ శాఖ అధికారులు కూడా ఆన్‌లైన్ విధానంలోనే సంబంధిత లావాదేవీలను పరిశీలించి ఆమోదించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ”ఈ-చిట్స్” విధానం వల్ల చిట్ ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడంతో పాటు చందాదారులు నష్టపోకుండా ఉపకరిస్తుందన్నారు. చిట్ ఫండ్ కంపెనీలను సమర్థవంతంగా నియంత్రించడం, వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడంలో ఈ నూతన విధానం దోహదపడగలదనే ఆశాభావాన్నివ్యక్తం చేశారు.
చిట్ ఫండ్ కంపెనీల విషయంలో చందాదారులు అప్రమత్తంగా ఉంటూ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని ముందుగా ఈ ”ఇ-చిట్స్” అప్లికేషన్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్ర్‌ని కూడా సంప్రదించవచ్చన్నారు. చిట్ ఫండ్ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశంతో పాటు ఆయా సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించే విధంగా ఈ నూతన విదానం అమల్లోకి వచ్చిందన్నారు. పూర్తి వివరాలను ఈచిట్స్.ఆర్‌ఎస్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌లో నిక్షిప్తం చేసినట్లు మంత్రి ధర్మాన వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రిజిస్ట్రేష్రన్స్ మరియు స్టాప్స్ శాఖ కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ వీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.