Saturday, November 2, 2024

విద్యాశాఖలో పదోన్నతలకు చెక్‌..! న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లాలోని విద్యాశాఖలో దాదాపు 8 ఖాళీలను డైరెక్టు నోటిఫికేషన్‌ ప్రకటించడంపై టీఎన్జీవో జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ముజీబ్‌కు వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా గతంలో విద్యాశాఖలో 11 ఖాళీలుండగా..ఇందులో మూడింటిని కారుణ్య నియమాకాలకు కేటాయించగా..మిగతా 8 పోస్టులను కూడా ఇటీవల టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ కలువడంపై టీఎన్జీవో జిల్లా, కేంద్ర నాయకత్వానికి..టీఎన్జీవో జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఆర్‌ రాజ్‌కుమార్‌, ఎం.భాస్కర్‌ తదితరులు విన్నవించారు.

ఇప్పటికైన కిందస్థాయి ఉద్యోగులు జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతలు పొందేందుకు ఆ ఎనిమిది పోస్టులు ఉపయోపడతాయని, అందువల్ల టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు, కేంద్ర నాయకులు మామిళ్ల రాజేందర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఇప్పటికే ఉన్నతాధికారులు ఫిర్యాదులు చేశామని టీఎన్జీవో నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు సైతం ఉద్యోగులకు సరైన న్యాయం దక్కేలా చూస్తామని చెబుతుండటం గమనార్హం. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఖాళీల్లో 30 శాతం డైరెక్టు రిక్రూట్‌మెంట్‌కు, మరో 70 శాతం పోస్టులను పదోన్నతలకు కేటాయించాలని ఉన్నట్లు టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం నాయకులు చెబుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement