Friday, November 22, 2024

కుటుంబ వ్యాపార ఆధిపత్యానికి చెక్‌.. బిల్లు రూపొందించిన ప్రభుత్వం..

ద‌శాబ్దాలుగా సాగుతున్న కుటుంబాల వ్యాపార ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని మార్చాలని అక్కడి ప్రభుతం భావిస్తోంది. దీని కోసం కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. కొత్త వారికి వ్యాపారాలు పెట్టేందుకు అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు విదేశీ కంపెనీలు కూడా యూఏఈలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవ‌కాశాలు ఉంటాయి. యూఏఈలో కొన్ని దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే వ్యాపార సామ్రాజ్యం నడుస్తోంది. కమర్షియల్‌ ఏజెన్సీ అగ్రిమెంట్‌ల సాయంతో విదేశీ కంపెనీలన్నింటిని ఈ కుటుంబాలే నడిపిస్తూ వస్తున్నాయి. ఆ కుటుంబం ఎంత చెబితే అంత… ఏం చెబితే అదే చెల్లుబాటు.. ఒప్పందాలు కూడా కొన్నేళ్ల పాటు అలాగే కొనసాగుతూ వచ్చేవి.

అయితే ఆ అగ్రిమెంట్‌ల ఆటోమేటిక్‌ రెన్యువల్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా యూఏఈ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇప్పటికే చట్ట రూపకల్పన జరిగిపోయినట్టు సమాచారం. ఎమిరేట్స్‌ నాయకత్వం దాన్ని ఆమోదం తెలపడమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎప్పటిలోపు ఆ చట్టం తీసుకురాబోతున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. గల్ఫ్‌ దేశంలో ఎక్కువ శాతం వ్యాపారాలు, ఇతర కమర్షియల్‌ కార్యకలాపాలు కూడా కొన్ని కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. హోటల్‌ ఫ్రాంచైజీల దగ్గరి నుంచి కార్‌ డీలర్‌ షిప్‌ వరకు ప్రతీది కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. ఒక వేళ ఈ నూతన చట్టానికి ఆమోదం లభిస్తే.. విదేశీ కంపెనీలకు ఊరట కలగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement