Friday, November 22, 2024

కరోనాకు చెక్.. జైకోవ్‌ డీ వ్యాక్సిన్‌… కోటి వ్యాక్సిన్స్ ఆర్డ‌ర్..

ప్ర‌భ‌న్యూస్ : గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడి లా ఫార్మా సంస్థ కరోనా మహమ్మారికి డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌కు ఆగస్టు 20న అనుమతులు లభించాయి. ఇది మూడు డోసుల వ్యాక్సిన్‌. అంతేకాదు.. దీనికి సూదితో పని లేదు.. .జెట్‌ అప్లికేటర్‌ పరికరంతో వ్యాక్సిన్‌ను అందిస్తారు. 12 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవ‌చ్చు. ప్రభుత్వం ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్‌ చేసింది. జైకోవ్‌ డీ వ్యాక్సిన్‌ను మొదట దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

బీహార్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే మూడు డోసుల వ్యాక్సిన్‌కు సంబంధించి ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఒక ఒక్కో డోసు ప్రభుత్వం రూ.265 చొప్పున కొనుగోలు చేసింది. దీంతో పాటు జెట్‌ అప్లికేటర్‌ అదనంగా మరో రూ.93 చెల్లించింది. అంటే ఒక్కో డోసును కేంద్రం రూ.358కి కొనుగోలు చేసింది. మొత్తం మొదటి విడతగా కోటి డోసులకు ఆర్డర్‌ చేసింది. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ డోసులను ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని అందించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement