Monday, November 25, 2024

అన్ని ఉద్ఘారాలకు చెక్‌.. రానున్నదంతా ఈవీ యుగం..

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాలుష్యాన్ని నివారించి.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యను ప్రోత్స హించడంతో.. వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పెరిగిన వాహనాలకు అనుగుణంగా.. వాటికి ఈవీ చార్జీంగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాధక ఇందన శక్తి ( టీఎస్‌ రెడ్కో) చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు 1,301 ప్రాంతాలను గుర్తించగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 400 ప్రాంతాలను ఐడెంటీపై చేసినప్పటికి.. ప్రస్తుతం 150 ప్రాంతాల్లో చార్జీంగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, సివిల్‌ సప్లై స్థలాలతో పాటు కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌తో పాటు మరో రెండు జిల్లాలను కలిపి మొత్తం ఐదు జిల్లాలో భూ సేకరణ పూర్తయింది. వీటిలో ఈ నెలఖార్‌ వరకు 30 నుంచి 50 కేంద్రాలను ప్రారంభించాలనే లక్ష్యంగా టీఎస్‌ రెడ్కో ముందుకు సాగుతోంది. ఇప్పటీ వరకు 30 ఈవీ చార్జీంగ్‌ కేంద్రాల్లో పనులన్ని పూర్తయి.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ స్టేషన్ల ద్వారా మార్కెట్‌ ధరల కంటే తక్కువకే చార్జింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం నాలుగు చక్రాల హనాలకు మాత్రమే చార్జీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండా, భవిష్యత్‌లో టూ వీలర్స్‌కు కూడా చార్జీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -

ఒక్కో మిషిన్‌ కేపాసిటీ 60 కిలోవాట్‌..

ఈవీ చార్జీంగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఒక్కో మిషన్‌ సామర్థ్యం 60 కిలోవాట్‌గా ఉంటుంది. ఒక్కో మిషన్‌కు రెండ్‌ గన్స్‌ (పంపులు) ఉంటాయి. ఒక మిషన్‌ వద్ద ఒకేసారి రెండు వాహనాలను చార్జీంగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వాహనం చార్జీంగ్‌ చేస్తే 30 నిమిషాల సమయం పడుతుంది. అదే రెండు వాహనాలకు ఒకేసారి చార్జీంగ్‌ చేస్తే 45 నిమిషాలు వరకు పడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నెక్సాన్‌ కొత్త కారు చార్జీంగ్‌ కావడానికి 40 నుంచి 48 యూనిట్ల విద్యుత్‌ అవసరం పడుతుంది. దాని ద్వారా ఈ వాహనం 450 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ వస్తుంది. అదే బీవైడీ కారు పుల్‌ చార్జ్‌ కావడానికి 70 యూనిట్ల విద్యుత్‌ అవసరం కాగా, దాంతో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.

రెండేళ్లలో 2 లక్షల వరకు పెరిగ అవకాశం..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీతో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్లపైన తిరుగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో వాటి సంఖ్య 2 లక్షల వరకు పెరగొచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. కగా, 2019లో 900 వాహనాలు మాత్రమే ఉండగా, 2020లో వాటి సంఖ్య 1,295కి చేరింది. 2020 సంవత్సరంలో 9,600 వరకు ఉండగా 2022 చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల వరకు వాహనాలు తిరుగుతున్నాయి.

ఈవీ వాహనాలకు ట్యాక్స్‌ మినహాయింపు..

ఈవీ పాలసీలో భాగంగా ఈవీ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలకు ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చింది. అందులో 2 లక్షల వరకు టూ వీలర్స్‌, 5 వేల వరకు నాలుగు చక్రాల వాహనాలు, 500 బస్సులు, 20 వేల ఆటోలు ట్యాక్స్‌ మినహాంపులో ఉన్నాయి.

అందుబాటులోకి ఈవీ యాప్‌..

ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో.. వాటికి చార్జీంగ్‌కు స్టేషన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఈవీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాటరీ డిచ్చార్జ్‌ అయితే.. ఆ దగ్గర్లో ఈవీ చార్జీంగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో యాప్‌ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఒక్కో వాహనం చార్జీంగ్‌ కావడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. చార్జీంగ్‌ కేంద్రం వద్ద వాహనాలు ఎక్కువగా ఉండటం సమయం వృధా అయ్యే అవకాం ఉంటుంది. సమయం వృధా కాకుండా ఉండేందుకు యాప్‌ ద్వారానే వాహనం చార్జీంగ్‌ చేసుకునేందుకు సమయాన్ని కూడా యాప్‌లోనే బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఆ సమయంలో వాహనదారుడికి టితో పాటు స్నాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చార్జింగ్‌కు సంబంధించిన డబ్బులను కూడా యాప్‌ద్వారా చెల్లించుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు.

ప్రయివేట్‌ వ్యక్తులు పెట్టుకునేందుకు అవకాశం..

ఈవీ చార్జీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయివేట్‌ వ్యక్తలు ముందు వస్తే.. వారిని ప్రభుత్వం ప్రోత్సహించేందుకు సిద్దంగా ఉంది. ఒక్కో చార్జీంగ్‌ కేంద్రం ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈవీ చార్జీంగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే వ్యక్తి మాత్రం స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈవీ చార్జీంగ్‌ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన పరికరాలన్నింటిని టీఎస్‌ రెడ్కో సమకూర్చుతోంది.

ఇప్పటీ వరకు పూర్తయిన 38 చార్జీంగ్‌ కేంద్రాలు..

1) సికింద్రాబాద్‌లోని మథర్‌థెరిసా విగ్రహం సమీపంలోని కీస్‌ హైస్కూల్‌, 2) సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌పాస్‌పోర్టు ఆఫీసు వెనక, 3) అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పక్కన, 4) చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి సమీపంలోని ఇస్సామియా బజారు, 5) ఓయూ మెడికల్‌ కాలేజీ సమీపంలో, 6) టోలీచౌకి సర్కిల్‌, 7) షేక్‌పేట్‌లోని ఇంపిరియల్‌ గార్డెన్‌ ఎదుట, 8) యూసుఫ్‌గూడలోని క్రిష్ణకాంత్‌ పార్కు వద్ద, 9) రాజీవ్‌నగర్‌ కాలనీ పార్కు, 10) ఐటీ పార్కు సనత్‌నగర్‌, 11) ఎల్బీ స్టేడియం, 12) ఇండోర్‌ స్టేడియం సరూర్‌నగర్‌, 13) ఈవీసీఎస్‌ ఆర్టీఏ నాగోల్‌, 15) టీసీఎస్‌ మెయిన్‌గేట్‌ గచ్చిబౌళి, 16) గచ్చిబౌళి స్టేడియం, 17) దుర్గం చెరువు, 18) జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శేరిలింగంపల్లి, 19) హెచ్‌ఎండీఏ ట్రక్‌పార్కు, 20) డైలైట్‌ ఆఫీసు 21) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, 21) లింగంపల్లి రైల్వేస్టేషన్‌, 22) డీఎల్‌ఎఫ్‌ భవనం గచ్చిబౌళి, 23) జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ చందానగర్‌, 24) అల్వీన్‌ ఎక్స్‌రోడ్‌ 26) ఎంఐజీ బెల్‌ కంపౌండ్‌ వాల్‌ 27) జిమ్‌ఖాన్‌ సబ్‌స్టేషన్‌ , 28) మారెడ్‌పల్లి సబ్‌స్టేషన్‌, 29) హకీంపేట్‌ సబ్‌స్టేషన్‌, 30) హెచ్‌ఎంటీ సబ్‌స్టేషన్‌, 31) బోయినపల్లి సబ్‌స్టేషన్‌ , 32) ఆర్‌పీ నిలయం సబ్‌స్టేషన్‌, 33) ఆల్వీన్‌ సబ్‌స్టేషన్‌, 34) సనత్‌నగర్‌ సబ్‌స్టేషన్‌, 35) గోల్కొండ సబ్‌స్టేషన్‌, 36) ఉప్పల్‌ సబ్‌స్టేషన్‌, 37) పీవేర్‌ హాస్పటల్‌లోని సబ్‌స్టేషన్‌, 38) మౌళాలి సబ్‌స్టేషనల్లలో ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు పూర్తయినాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement