Thursday, October 17, 2024

Cheating – ఆధారాలు స‌మ‌ర్పించిన లావణ్య – హీరో రాజ్ త‌రుణ్ పై కేసు

సినీ నటుడు రాజ్‌ తరుణ్ ( పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు 420, 506, 493 సెక్షన్ల కింద రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్‌ కొనసాగిస్తున్నట్టు తేలిందని, ఇదే విషయమై అతన్ని నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది.

”రాజ్‌తరుణ్‌తో నాకు పదేళ్ల క్రితమే వివాహ మైంది. ఇద్దరం కలిసే జీవిస్తున్నాం. కొన్నాళ్ల క్రితం నాకు అబార్షన్‌ చేయించాడు. ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లాం” అని అందుకు సంబంధించి కొన్ని ఆధారాలను లావణ్య పోలీసులకు చూపించారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement