ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా చాలా తక్కువ ధరకు భారత్‌కు ముడి చమురును అమ్ముతోంది. అమెరికా, బ్రిటన్‌తోసహా అన్ని పాశ్చాత్య దేశాలు రష్యా నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కానీ భారత్ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. రష్యా నుంచి మనకంటే యూరోపియన్ దేశాలు ఎక్కువ ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయని చెబుతోంది. ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి, సరఫరా సంక్షోభం కారణంగా ప్రపంచంలో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిలో రష్యాతో చౌకగా చమురు ఒప్పందం భారత్‌కు అనేక రకాలుగా ప్రయోజనకరంగా మారనుంది. భారత్ తన ముడి చమురు అవసరాలలో 80శాతం దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 19.35మిలియన్ టన్నుల ముడిచమురు దిగుమతి అయింది. ఇందుకోసం 105 బిలియన్ 800 మిలియన్ డాలర్లు చెల్లించారు. భారత్ ముడిచమురులో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్, అమెరికా నుండి వస్తుంది. 2021లో రష్యా నుంచి భారత్ 12 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది, ఇది మొత్తం
దిగుమతుల్లో 2శాతం కాగా భారత్ దీని కంటే ఎక్కువ చమురును ఉత్పత్తి చేస్తుంది. ముడిచమురు దిగుమ తులపై భారత్‌కు బ్యారెల్‌కు 35 డాలర్ల వరకు రష్యా తగ్గింపు ఇస్తోంది. భారత్ రష్యా నుండి చమురు సరఫరాను పెంచినట్లయితే, అది దేశంలో చమురు ధరలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కమోడిటీ రీసెర్చ్ గ్రూప్ కెప్లర్ నివేదిక ప్రకారం భారత్ జనవరి, ఫిబ్రవరిలో రష్యా నుండి ఎటువంటి చము రును కొనుగోలు చేయలేదు. అయితే మార్చి, ఏప్రిల్‌లో 6మిలియన్ బ్యారెళ్ల చమురు డీల్ చేసింది. భారత్‌కు చౌకగా చమురు ఇవ్వాలని రష్యా నిర్ణయించింది. ముందుగా 15 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది
పెట్రోధరల స్థిరత్వానికి దోహదం..
రష్యా నుంచి దిగుమతయ్యే చౌక చమురు వల్ల భారత్‌కు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశంలో పెట్రోల్, ధరలను స్థిరంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. ఇటీవల పెట్రోధరలు దాదాపు ప్రతిరోజూ పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లిdలోనే పెట్రోలు లీటరుకు రూ.100 దాటిపోయింది. చమురు ధరలు పెరిగితే.. స#హజంగా అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈక్రమంలో ఇతర వస్తువుల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ఇది సహాయ పడుతుంది, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉండదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం బ్యారెల్‌కు 108.32 డాలర్లుగా ఉండగా.. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 103.62 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా సైనిక కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు బ్రెంట్ చమురు ధరలు 2014 తర్వాత మొదటిసారిగా 100డాలర్లు దాటాయి. ఆ తర్వాత ఫ్యూచర్స్ రేటు 130.5 డాలర్లకు చేరుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..