ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ జరుగుతోంది.
బస్తర్, జగదల్‌పూర్, చిత్రకోట్‌లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. అంతగఢ్, భానుప్రతాపూర్, కంకేర్, కేస్‌కల్, కోండగావ్, నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో మధ్యాహ్నం మూడు వరకే పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.