ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో కీలక భూమిక పోషిస్తున్న బస్తర్ ఫైటర్స్ దళంలో మరో 9 మంది ట్రాన్స్‌జెండర్లను నియమించారు. గత ఏడాది ఎంపికైన వీరు వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు. తదుపరి కేంద్ర పారామిలిటరీ బలగాలతో కలిసి మావోయిస్టుల వ్యతిరేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ రేంజిలోని కాంకేర్ జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు. 2021లో బస్తర్ ఫైటర్స్ ప్లాటూన్‌ను 2,100 మంది స్థానిక యువతతో ఏర్పాటు చేశారు. బస్తర్, దంతెవాడ, కాంకేర్, బీజాపూర్, నారాయణ్‌పూర్, సుక్మా, కొండగావ్ జిల్లాల్లో కేంద్ర బలగాలతో కలిసి వీరు పనిచేస్తున్నారు. ఇందులో ఇదివరకే 90 మంది మహిళలు, 13 మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా.. తాజాగా మరో 9 మంది ట్రాన్స్‌జెండర్లు విధుల్లో చేరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement