హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఛత్తీస్ గడ్-ఒడిశా సరిహద్దులో గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో అగ్రనేత చంద్రహాస్ మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతా దళాలు ఆలస్యంగా గుర్తించాయి. ఇదే కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్రెడ్డి అలియాస్ చలపతితో పాటు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఎన్ కౌంటర్ లోనే మావోయిస్టు మరో అగ్ర నేత కూడా మృతిచెందినట్లు తాజాగా తెలిసింది. తెలంగాణకు చెందిన చంద్రహాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ వాసి
మృతి చెందిన చంద్రహాస్ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పరిధి యాప్రాల్ వాసి ప్రమోద్ -లియాస్ చంద్రహాస్ గా పోలీసులు గుర్తించారు. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ వ్యారో ఇన్ఛార్జ్ ఉన్న అతడి తలపై రూ.20 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపూర్‌కు తరలించారు.