హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని మావోయిస్టులు ఉంచిన భారీ డంప్‌ను గురువారం భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దండకారణ్యంలో జల్లెడపడుతున్న భద్రత దళాలైన 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ జవాన్లు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా డంప్ స్వాధీనం చేసుకున్నారు.
మెటగూడెంనకు సమీపాన గుహలో…
మెటగూడెం గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను తొలుత భద్రతా బలగాలు కనిపెట్టాయి. అందులోని ఆయుధశాలలో ప్యాక్ చేసిన 21 ఐఈడీలు, బహుళ బారెల్ గ్రెనేడ్ లాంచర్, బాంబులు, పేలుడు తయారీ పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
- Advertisement -