Tuesday, November 26, 2024

చాట్‌జీపీటీ యూజర్ల డేటా లీక్‌.. ?

సైబర్‌దాడులు చాట్‌ జీపీటీకి కూడా విస్తరించాయని సింగపూర్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గ్రూప్‌ ఐబి తెలిపింది ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష మంది చాట్‌జీపీటీ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు పేర్కొంది. ఈ సైబర్‌దాడి కోసం ఇన్పో-సీలింగ్‌ మాల్‌వేర్‌ను ఉపయోగించినట్లు బ్లాగ్‌లో పేర్కొంది. ఈ మాల్‌వేర్‌ సాయంతో హ్యాకర్లు యూజర్ల బ్రౌజర్‌ డేటాతో పాటు బ్యాంక్‌ కార్డ్‌ల వివరాలు, క్రిఎ్టో వాలెట్‌ సమాచారం, బ్రౌజింగ్‌ హస్టరీ వంటి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది.

యూజర్లు తమ బ్రౌజర్ల నుంచి అధీకృతం కానీ వెబ్‌ లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా హ్యాకర్లు మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టినట్లు గుర్తించామని గ్రూప్‌-ఐబీ వెల్లడించింది. దీనిపై చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ స్పందించాల్సి ఉంది. హ్యాకర్ల వద్ద ఉన్న డేటాలో ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతానికి చెందిన యూజర్ల సమాచారం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. భారత్‌ సహా పాకిస్థాన్‌, బ్రెజిల్‌, వియత్నాం, ఈజిప్ట్‌ దేశాలకు చెందిన యూజర్ల సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు తెలిపింది. ఈ వివరాలను హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు గ్రూప్‌-ఐబీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement